Ticker

6/recent/ticker-posts

స్వీట్ రేవెంజ్ తో సెమీస్ కి దూసుకు వెళ్లిన ఇండియా, రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్

 స్వీట్ రేవెంజ్ తో  సెమీస్ కి దూసుకు వెళ్లిన ఇండియా, రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్

టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు ప్రతీకార  అమోఘమైన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బతీసింది.

సెయింట్ లూసియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా. తొలుత బ్యాటింగ్‌ చేసిన 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియాను 181 పరుగుల వద్దే కట్టడి చేసింది.

 రోహిత్ శర్మ సునామి

Ind vs aus telugu today Ind vs aus telugu live Ind vs aus telugu highlights Ind vs aus telugu 2021 Ind vs aus telugu t20 Ind vs aus telugu prediction చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా IND vs AUS : రెచ్చిపోయిన రోహిత్.. ఆస్ట్రేలియా టార్గెట్ 206.


కేప్టెన్ రోహిత్ శర్మ 92 పరుగులతో  సునామీ సృష్టించాడు. కేవలం 41 బంతుల్లో ఎనిమిది  భారీసిక్సర్లు, ఏడు ఫోర్లతో  తనకే సాధ్యమైన షాట్లతో కొన్ని నెలల ముందు రోహిత్ శర్మను గుర్తుకు తెచ్చాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఓడించిందనే  కసిని అతని బ్యాటింగ్  తీర్చుకున్నాడా అన్నట్టు సాగింది. రోహిత్ ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. టీమిండియా స్కోర్ 200 మార్క్‌ను ఈ టోర్నమెంట్‌లో మొట్టమొదటిసారిగా అధిగమించింది. ఈ ఇన్నింగ్‌తో రోహిత్ శర్మ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టయింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులను చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

  రికార్డులు

ఇప్పటివరకు ఆడిన 157 టీ20ల్లో 4,165 కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. దాన్ని అధిగమించాడు రోహిత్ శర్మ. 123 టీ20ల్లో 4,145 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండేవాడు కోహ్లీ. ఇప్పుడు రెండో స్థానానికి దిగాడు.

ఇందులో బాబర్ ఆజమ్‌ది మూడోస్థానం. 4,103 పరుగు అతని పేరు మీద ఉన్నాయి. అదే క్రమంలో పాకిస్తాన్  ప్లేయర్ బాబర్ ఆజమ్ రికార్డును కూడా సమం చేశాడు రోహిత్. సారధిగా టీ20ల్లో ఎక్కువసార్లు జట్టును గెలిపించిన రికార్డు ప్రస్తుతం బాబర్ ఆజమ్ పేరు మీద ఉంది. దాన్ని ఈక్వల్ చేశాడు.


 మ్యాచ్ మలుపు తిప్పిన అక్షర పటేల్ క్యాచ్

Ind vs aus telugu today Ind vs aus telugu live Ind vs aus telugu highlights Ind vs aus telugu 2021 Ind vs aus telugu t20 Ind vs aus telugu prediction చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా IND vs AUS : రెచ్చిపోయిన రోహిత్.. ఆస్ట్రేలియా టార్గెట్ 206.

206 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (6) త్వరగానే ఔట్‌ అయినా.. మిచెల్ తో కలిసి మళ్ళీ ఇన్నింగ్స్  చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌ 2023ను భారత్‌కు దక్కకుండా చేసిన ట్రావిస్‌ హెడ్‌ మరోసారి రెచ్చిపోయాడు. కానీ కీలక సమయంలో మార్ష్‌ (28 బంతుల్లో 37 రన్స్‌)ను ఔట్‌ చేసిన కుల్‌దీప్‌ భారత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఆ తర్వాత వికెట్లు పడుతున్నా ట్రావిస్‌ హెడ్‌ మాత్రం బాదడం ఆపలేదు. ఇంతలో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ మ్యాచ్నుమలుపు తిప్పింది.

  అద్భుతమైన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపాన్ని అక్షర పటేల్ మార్చిన విధానం అద్భుతం అమోఘం, బౌలింగ్ విభాగం, ఫీలింగ్ మరియు బ్యాటింగ్ విభాగాల సమన్వయ కలయికే ఈ విజయం అని ప్రేక్షకులు కొనియడం జరిగింది.. ఏ టీం కైనా కావాల్సింది ముఖ్యంగా సరియైన టైంలో సరైన నిర్ణయం, ఈ మ్యాచ్ గెలవడం  వల్ల ఇండియా నేరుగా సెమిస్లోకి అడుగుపెట్టడం, సెమిస్లో ఇంగ్లాండ్ జట్టుతో అమీతుమీకి సిద్ధమవుతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు