ఎవరు వెళ్తారు ఫైనల్ కి దక్షిణాఫ్రికానా? లేక ఆఫ్ఘనిస్తాన్? ఇండియా? లేక ఇంగ్లాండ్? T20Worldcup 2024
సెమీఫైనల్1 దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్: 27/6/2024 ఉదయం 6 గంటలకు,ఈ మ్యాచ్ బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ టరూబా, ట్రినిడాడ్ మరియు టొబాగోలో జరగనుంది. ఇద్దరూ బాగా కష్టపడి ఈ సేమిస్ కి చేరడం జరిగింది. వారి బలాలు మరియు బలహీనతలు ఒకసారి చూద్దాం.
దక్షిణాఫ్రికా: దక్షిణాఫ్రికా అంటేనే ఫాస్ట్ బౌలింగ్ మరియు ఫీల్డింగ్లో అత్యుత్తమ జట్టు
ఓపెనర్లుగా డికాక్ మాత్రం గత రెండు మూడు మ్యాచ్ల నుంచి రాణిస్తున్నాడు, కానీ మరో ఓపెనర్ ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. కెప్టెన్ మార్కరం కూడా సరిగా తన ప్రమాణాలు తగ్గట్టుగా ఆడటం లేదు. మిడిల్ ఆర్డర్ కూడా అంతే మిల్లర్ మరియు స్టబ్స్ పర్వాలేదు అన్నట్టుంది, క్లాసెన్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ బాకీ ఉంది.
బౌలింగ్ లో దక్షిణాఫ్రికా ఎప్పుడు మెరుగ్గానే ప్రదర్శన చూపుతుంది, అయితే ఒక్కోసారి చాలా దారాళంగా పరుగులు సమర్పించుకుంటుంది. వారి ముఖ్యమైన బలహీనత ఒత్తిడిలో గొప్పగా రాణించలేకపోవడం. మనం చాలా సార్లు చూసే ఉంటాం వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు ముఖ్యంగా చేజింగ్ చేస్తున్నప్పుడు పూర్తిగా రక్షణాత్మక క్రికెట్ ఆడుతారు. అది చాలాసార్లు వారిని కష్టాల్లోకి నెట్టడమే గాక ఓడిపోయిన సందర్భాలు ఎన్నో, ముందు దక్షిణాఫ్రికా దాన్నుంచి బయటకు రావాలి. ఎటాకింగ్ క్రికెట్ ఆడాలి.మరో బలహీనత నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కోవటంలో వీరు తడబడుతూ ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ టీం లో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్స్ ఉన్నారు వారిని ఎలా ఎదుర్కొంటారు అనేది ముఖ్యమైన విషయం.
ఆఫ్ఘనిస్తాన్: ఈ టీం గురించి చెప్పేదేముంది అంచనాలకు మించి టోర్నీ మొత్తం ఆకట్టుకున్నారు. వీరి బలం స్పిన్ బౌలింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ మరియు నూర్.
బ్యాటింగ్కు వస్తే గుల్బర్ట్ మంచి ప్రదర్శన కనబరుస్తూ మంచి ఎటాకింగ్ క్రికెట్ ఆడుతున్నాడు, ముందుగా దక్షిణాఫ్రికా ఈ వికెట్ తీయడం చాలా ఇంపార్టెంట్ లేదు అంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాగే మిడిల్ ఆర్డర్ కూడా కొంతవరకు బాగానే ఉంది, కానీ వారిబలం
బౌలింగ్. బలహీనత వికెట్లు పడితే కంటిన్యూగా వికెట్లు పడుతూనే ఉండటం నిలకడగా లేని బ్యాటింగ్.
ఎవరు వెళ్తారు ఫైనల్ కి ఇండియానా? లేక ఇంగ్లాండ్?
సెమీ ఫైనల్2 ఇండియా vs ఇంగ్లాండ్ :27/6/2024 రాత్రి 8 గంటలకు, రెండు బలమైనజట్లే, ఇరుజట్లలోను భయంకరమైన ఓపెనర్స్ ఉన్నారు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ కూడా ఇద్దరికీ మంచి బలమే. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇండియా అదే పై చేయి.
ఇండియా: ప్రస్తుత క్రికెట్ జట్లలో ఇండియా బలమైన జట్టు ముఖ్యంగా ఓపెనర్స్ గా వస్తున్న రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ చాలామంది అనుకొని ఉండొచ్చు విరాట్ కోహ్లీ పూర్తి ప్రదర్శన చేయట్లేదు అని, కానీ అలాంటి క్రికెటర్ కు మునుపటి మ్యాచ్లతో సంబంధం ఉండదు. ఎప్పుడు వాళ్ళు ఫామ్ లోకి వస్తారో ఎవరో చెప్పలేదు, ముఖ్యంగా చేజింగ్ జరుగుతోంది అంటే విరాట్ కోహ్లీ ఉన్నట్టే అని మనందరికీ తెలుసు అలాగే ఫామ్ తో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే క్రికెటర్.
ఇంకా రోహిత్ శర్మ ఈ హిట్ మాన్ గురించి చెప్పేదేముంది మొన్న ఆస్ట్రేలియాకు ఇచ్చిన షాక్ ఆస్ట్రేలియా ఎప్పటికి మర్చిపోలేదు. తనదైన రోజు రోహిత్ శర్మను ఆపటం ఎవరి తరం కాదు తనకే సాధ్యమైన షార్టుతో ప్రత్యర్థ బౌలర్లపై విరుచుకుపడటం రోహిత్ నైజం.
మిడిల్ ఆర్డర్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తోంది, కానీ ఇంగ్లాండ్ లాంటి ప్రత్యర్థి తో ఆడేటప్పుడు ఇంకా మెరుగైన ప్రదర్శన కావాలి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పుడున్న ప్రపంచ క్రికెట్లో ఇండియా బౌలింగ్ అత్యుత్తమంగా కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం బుమ్రా, తన బౌలింగ్ ఆడటం దాదాపు అత్యుత్తమ బ్యాట్స్మెన్ సైతం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, అదేవిధంగా బుమ్రా కు మంచి సపోర్ట్ ఉంటే ఇక మన బౌలింగ్ ఆపటం ఎవరి తరం కాదు. ఇంగ్లాండ్లో చాలామంది బ్యాట్స్మెన్ మంచి హిట్టర్స్ ఉన్నారు. వారికి ఇండియా ఎలాంటి బౌలింగ్ వేస్తుంది అనేదే ముఖ్య విషయం.
ఇంగ్లాండ్: డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఈ టీం తమదైన రోజు ప్రత్యర్థి ఎవరైనా కానీ ముందుగా బ్యాటింగ్తో విరుచుకుపడుతుంది,రషీద్ మరియు ఆర్చర్ వీరి బలం.
బ్యాటింగ్ విషయానికి వస్తే సాల్ట్ మరియు బట్లర్ ఇద్దరు ఓపెనర్స్ ఏ ఒక్కరిని పవర్ ప్లే లోపు అవుట్ చేయకపోయినా ఇండియా కష్టాలు తప్పవు వారిని అవుట్ చేయటానికి ఇండియా సరియైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా మిడిల్ ఆర్డర్లో కూడా భయంకరమైన బ్యాట్స్మెన్ ఉండటం ఇంగ్లాండ్ టీం కి బలం, బౌలింగ్లో కూడా వారు మంచి బౌల్లెర్స్ఉన్నారు.
ఇంగ్లాండ్ ముఖ్యమైన బలహీనత బౌలింగ్ చాలా సందర్భాల్లో ఇంగ్లాండ్ బౌలింగ్లో వాళ్ళ కంట్రోల్ తప్పుతూ ఉంటుంది, ముందుగా ఎవరైనా వారి బౌలింగ్ ని ఎదురుదాడి చేసినట్లయితే వారి కంట్రోల్ తప్పి మరిన్ని పరుగులు సమర్పించుకోవడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఇండియా ఈ విషయాలు ఆలోచించాలి.
ఇంతకీ మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో చెప్పండి




0 కామెంట్‌లు