ఇటీవల మరణించిన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సంస్కరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమరావతి నిర్మాణానికి ఈనాడు సంస్థల ఎండి రూ. 10 కోట్ల విరాళాన్ని అందించారు.
ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అదనపు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి కాలాన్ని ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో న్యాయ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ లా సెట్ ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ నిన్న విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బి.ఎడ్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్ సెట్ -2024 ఫలితాలను నిన్న సెట్ కన్వీనర్ విడుదల చేశారు.
ఏపీ పీజీ సెట్-2024 ఫ లితాలను నిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సెట్ కన్వీనర్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జూలై 1వ తేదీన మొత్తం 65.18 లక్షల మందికి రూ.4,399 కోట్ల రూపాయలను గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్దనే అందించేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఉప విద్యాశాఖ అధికారి (డివైఈవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిన్న ప్రకటించింది.
రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న అమరావతిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డిజిపి ద్వారక తిరుమలరావు ఇతర పోలీసు ఉన్నత అధికారులతో పోలీసు శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
T20Worldcup2024 లో ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా, సెమీఫైనల్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం, ఇండియన్ స్పిన్నర్స్ ని ఎదుర్కోలేక తడబడిన ఇంగ్లాండ్ జట్టు. 29 ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా తో తలపడనున్న ఉన్న టీమిండియా.సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై,68 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.స్కోర్లు:భారత్ 171/7, ఇంగ్లాండ్ 103అలౌట్.
తిరుమల:కంపార్టుమెంట్లన్ని నిండి నారాయణగిరి షెడ్ల వరకు, వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న60,782మంది భక్తులు..నిన్న హుండీ ఆదాయం 3.53కోట్లు
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ నియామకం
AP: అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, ఎండీగా విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె 2014-19 మధ్య కాలంలో ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై అవగాహన ఉండటంతో ఆమెను నియమించారు.
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
As a marketing and digital marketing writer, my job would be to create content that helps businesses promote their products or services to their target audience. This could include writing blog posts, articles, newsletters, social media posts, and more.
1 కామెంట్లు
Good Information
రిప్లయితొలగించండి