Ticker

6/recent/ticker-posts

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కి, ఆస్ట్రేలియా ఇంటికి…T20 World Cup 2024

 ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కి, ఆస్ట్రేలియా ఇంటికి…T20 World Cup 2024


 ఇప్పుడే ఒక అద్భుతమైన మ్యాచ్ చూడడం జరిగింది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎంత అద్భుతంగా ఆడిందంటే వాళ్లు ఇప్పటిదాకా ఇచ్చిన బెస్ట్ పర్ఫామెన్స్ లో ఇది కూడా ఒకటి  అనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి ప్రదర్శనకు ఇది రివార్డ్, వారు ఈ విజయానికి అలాగే సెమీస్ కి వెళ్ళటానికి పూర్తిగా అర్హులు.

 

FG vs BAN highlights - Rashid, Naveen help Afghanistan Afghanistan vs Bangladesh Highlights, T20 World Cup 2024 AFG vs BAN Live Score, T20 World Cup Super 8: Litton fifty  Afg vs ban live score Afg vs ban live Afg vs ban highlights Afg vs ban t20

వర్షం అంతరాయం చేస్తూనే ఉంది కానీ…

 పలుమార్లు ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది, వర్షం పడిన ప్రతిసారి  ప్రేక్షకుల్లో ఉత్కంఠం మొదలవుతుంది. అదేవిధంగా ఒకానొక సమయంలో బంగ్లాదేశ్ కూడా  సెమిస్కువెళ్లే  అవకాశాలు వచ్చాయి. వారు కూడా దానికోసం చాలా ప్రయత్నించారు. బయట ఉన్న మిగతా టీమ్స్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా కూడా  ఈ మ్యాచ్ని చాలా ఉత్కంఠంతో చూసి ఉంటారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఏమో వాళ్లతో ఎవరు ఆడతారు అని అలాగే ఆస్ట్రేలియా అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే వారికి అవకాశాలు వస్తాయని, అలా ఈ మ్యాచ్ అందరిలోనూ చాలా ఉత్కంఠం రేపింది

 అద్భుతమైన విజయం

 వివరాల్లోకి వెళితే  ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ vs  బంగ్లాదేశ్ మధ్య T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ  పోరులో బంగ్లాదేశ్ పై అద్భుత విజయాన్ని సాధించి, ఆఫ్ఘనిస్తాన్ సెమిస్లోకి అడుగు పెట్టింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన  ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లకు 115 పరుగులు చేసింది, 116  పరుగుల  విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ చెట్టు 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఆఫ్గనిస్తాన్  సెమిస్కి అడుగు పెట్టింది’

హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్

 కానీ ఒక్కటి మటుకు నిజం “హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్” అని నిరూపించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు, వారి మీద పూర్తిస్థాయిలో అంచనాలు లేకపోయినా అంచనాలకు మించి ఈ టోర్నీ మొత్తం వారి ప్రదర్శన అమోఘం వారు చాలా పెద్ద  జట్లను ఓడిస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మొదట్లో న్యూజిలాండ్, ను మొన్న  ఆస్ట్రేలియాను  ఈరోజు బంగ్లాదేశ్ కు  షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఆ టీం కూడా టోర్నీ టోర్నీకి చాలా బాగా ఆడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం.

FG vs BAN highlights - Rashid, Naveen help Afghanistan Afghanistan vs Bangladesh Highlights, T20 World Cup 2024 AFG vs BAN Live Score, T20 World Cup Super 8: Litton fifty  Afg vs ban live score Afg vs ban live Afg vs ban highlights Afg vs ban t20


 నిదానంగా బ్యాటింగ్ భయంకరంగా బౌలింగ్…

 మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు స్లోగా ఉండటంతో పెద్దగా రన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో తడబడిన, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసి విజయాలు అందుకున్నారు. బంగ్లాదేశ్ జట్టులో లిట్టందాస్ ఒక్కడే  అద్భుతంగా పోరాడి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు, ఒక  ఎండలో వికెట్లు పడుతున్న తన మటుకు పోరాడుతూనే ఉన్నాడు  54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ 4 వికెట్లు మరియు నవీన్  నాలుగు వికెట్లు సాధించి, ఆఫ్గనిస్తాలకు ఘనమైన విజయాన్ని అందించారు.

 అయితే ఆఫ్గనిస్తాన్ సెమీస్లో దక్షిణాఫ్రికా ను ఎదుర్కొనుంది ఆ మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారుతుంది. మరొక సేమిస్లో ఇండియా ఇంగ్లాండ్ తో  ఎదుర్కోనుంది.

 బౌలింగ్లో అద్భుత ప్రదర్శన  నవీన్ కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్”  అవార్డు దక్కింది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు