🚧 భీమడోలు–ద్వారకాతిరుమల మార్గం… ప్రమాదాల మార్గమైంది!
ఏలూరు జిల్లా: భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వరకు వెళ్లే రహదారి భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థం ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం, పౌర్ణమి రోజుల్లో ఈ మార్గంలో వాహన రద్దీ భారీగా ఉంటుంది. అయితే, రహదారి పరిస్థితి మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది.
రోడ్డు అంతటా గుంతలు, అసమాన ఉపరితలాలు, కారణంగా తరచూ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. గత కొద్ది నెలల్లో ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు–ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
స్థానికులు మరియు భక్తులు పలుమార్లు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.కనీసం గుంతలు పూడ్చడానికీ, మరమ్మతులు చేపట్టడానికీ అధికారులు ముందుకు రాకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రహదారి పరిస్థితి కారణంగా RTC బస్సులు కూడా ఈ మార్గంలో నడపడానికి ఇబ్బందిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే భక్తులకు తగినంత బస్సులు అందక ఇబ్బందులు పడుతుంటే, ఉన్న బస్సులు కూడా నెమ్మదిగా నడవడం వల్ల సమయానికి గమ్యానికి చేరుకోవడంలో ఆలస్యం అవుతోంది. అత్యవసర సేవల వాహనాలకూ ఈ దారిలో ప్రయాణం సవాలుగా మారింది.
భక్తుల ప్రాణాలను కాపాడటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచటానికి ఈ రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని స్థానికులు, భక్తులు ప్రభుత్వం మరియు రోడ్ల నిర్మాణ శాఖను విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలస్యమైతే మరింత ప్రాణనష్టం జరుగవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
.jpeg)


.jpeg)
0 కామెంట్‌లు