📰"ఎక్కడ అవసరం ఉన్నా వెంటనే తెలియజేయండి" — ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పిలుపు
గోపాలపురం:
ప్రకృతి విపత్తు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామస్థాయిల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “విపత్తు పరిస్థితులు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ప్రభుత్వ బిల్లులు లేకుండానే తానే వ్యక్తిగతంగా అన్ని ఖర్చులను భరిస్తాను” అని తెలిపారు.
ఎక్కడైనా పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఆహారం, నీరు వంటి సౌకర్యాలను అందించేందుకు ద్వారక తిరుమల దేవస్థానం సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారమివ్వాలని, ప్రభుత్వం అన్ని రకాల సాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ స్థాయిలో అవసరమైన వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. “ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. ఎక్కడ ఏ అవసరం ఉన్నా వెంటనే తెలియజేయాలి” అని ఆయన అన్నారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులు, స్థానిక నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే, తుఫాన్ మరియు ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు.

0 కామెంట్‌లు