Ticker

6/recent/ticker-posts

ద్వారకాతిరుమలలో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు అత్యవసరం – బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర

 ద్వారకాతిరుమలలో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు అత్యవసరం – బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర



📍ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల

ద్వారకాతిరుమలలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

సమావేశానికి ముందు మాట్లాడిన పిక్కి నాగేంద్ర గారు మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో ద్వారకాతిరుమలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన ఈ పవిత్ర ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రభుత్వ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం విచారకరం. విద్యార్థులు ఉన్నత విద్య కోసం భీమడోలు లేదా కామవరపుకోటకు వెళ్లాల్సి రావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదు.

అయితే ప్రస్తుత ప్రజాప్రతినిధులు — మా ఎంపీ పురందేశ్వరి గారు, ఎమ్మెల్యే వెంకటరాజు గారు — ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ద్వారకాతిరుమలలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కావాలని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది,” అని పేర్కొన్నారు.

అలాగే స్థానిక సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, మరమ్మత్తులు, ప్రాథమిక సదుపాయాల మెరుగుదలపై అధికారులను, ప్రజాప్రతినిధులను చర్యలు తీసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు