ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం
![]() |
| చోరీలో రికవరీ చేసిన సొత్తును బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న ఏలూరు జిల్లా పోలీసులు |
ఏలూరు | వెబ్ డెస్క్ :
ఏలూరు
జిల్లా
ఎస్పీ
ప్రతాప్ శివ కిషోర్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు,
జిల్లా
వ్యాప్తంగా చోరీ
కేసుల్లో రికవరీ
చేసిన
సొత్తును బాధితులకే స్వయంగా వారి
ఇళ్లకు
వెళ్లి
అందజేసే వినూత్న కార్యక్రమాన్ని ఏలూరు
జిల్లా
పోలీసులు అమలు
చేస్తున్నారు. ఈ
చర్య
ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత
బలపరుస్తోంది.
గత
నెలలో
ద్వారకాతిరుమలలో జరిగిన
రెండు
ఇంటి
దొంగతనాల కేసులకు సంబంధించి, భీమడోలు సీఐ
యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ
సుధీర్, ఇతర
పోలీస్
సిబ్బంది కలిసి
నిందితుల నుంచి
రికవరీ
చేసిన
సొత్తును బాధితుల నివాసాల వద్దకు
వెళ్లి
అందజేశారు. ఈ
సందర్భంగా పోలుబోయిన లక్ష్మయ్య అనే
బాధితుడికి ఏడు కాసుల బంగారు ఆభరణాలు, కనిగొల్ల కాశి
అనే
వ్యక్తికి రూ.2 లక్షల నగదును పోలీసులు స్వయంగా అప్పగించారు.
అదేవిధంగా ద్వారకాతిరుమల పోలీస్
స్టేషన్ పరిధిలో రికవరీ
చేసిన
28 మొబైల్ ఫోన్లను కూడా
సంబంధిత బాధితులకు అందించారు. ఈ
కార్యక్రమాన్ని జిల్లా
వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్గా చేపట్టి, ఏలూరు,
జంగారెడ్డిగూడెం, పోలవరం,
నూజివీడు సబ్
డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు పలు
దొంగతనాల కేసుల్లో బాధితులు కోల్పోయిన బంగారు,
వెండి
ఆభరణాలను పోలీసులు విజయవంతంగా రికవరీ
చేశారు.
![]() |
| జంగారెడ్డిగూడెం మండలంలో వృద్ధురాలికి బంగారు తాడు అందజేస్తున్న పోలీస్ అధికారులు |
పట్టణ
పరిధిలో కూడా
మరో
రెండు
కుటుంబాలకు చోరీలో
రికవరీ
చేసిన
బంగారు
ఆభరణాలను పోలీసులు స్వయంగా వారి
ఇళ్లకు
వెళ్లి
అందజేశారు. బాధితుల ఇళ్లకు
వచ్చి
పోలీసులు తమ
కోల్పోయిన సొత్తును అప్పగించడంతో బాధితులు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పోలీస్
సేవలను
అభినందించారు.
ఈ
సందర్భంగా భీమడోలు సీఐ
యూజే
విల్సన్ మాట్లాడుతూ, జిల్లా
ఎస్పీ
ఆదేశాల
మేరకు
గ్రామ
రెవెన్యూ అధికారుల సమక్షంలో భీమడోలు పోలీస్
స్టేషన్ పరిధిలో చోరీకి
గురై
రికవరీ
చేసిన
28 మొబైల్ ఫోన్లు, రెండు వేర్వేరు ఘటనల్లో చోరీ అయిన 17 కాసుల బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు అందజేశామని తెలిపారు. ఈ
కార్యక్రమానికి ప్రజల
నుంచి
మంచి
స్పందన
లభించిందని చెప్పారు.
ఏలూరు
జిల్లా
పోలీసులు చేపట్టిన ఈ
వినూత్న కార్యక్రమం ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు,
చోరీలకు పాల్పడే వారికి
గట్టి
హెచ్చరికగా మారిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


0 కామెంట్‌లు