Ticker

6/recent/ticker-posts

కంచి 71 వ పీఠాధిపతి నూతన నామధేయం " శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి "

 కంచి 71 వ పీఠాధిపతి నూతన నామధేయం 

" శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి "


కంచి 71 వ పీఠాధిపతి నూతన నామధేయం  " శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి "



శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ


కంచి కామ కోటి నూతన పీఠాధిపతికి సిఎం శుభాకాంక్షలు హైదరాబాద్ :కంచి కామకోటి పీఠం 71 వ ఆచార్యులుగా దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ అభిషేక వేడుక శుభ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు వారికి శుభాభినందనలు తెలియజేశారు. గణేష శర్మ  ఋగ్వేద పండితులుగా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవికి, తెలంగాణ ప్రాంతానికి ఎలలేని ధార్మిక సేవ చేశారని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

✳️ ఋగ్వేదంలోనే కాకుండా యజుర్వేదం, సామవేదం, షడాంగాలు, దశోపనిషత్తుల్లో జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి కృపతో అపారమైన జ్ఞానార్జన చేశారని గుర్తుచేశారు. సనాతన ధర్మ గురుపరంపరకు, భక్తి తత్వానికి, జ్ఞాన మార్గానికి బాటలు వేసే ఈ వేడుక తెలంగాణ ప్రజలందరికీ మధుర జ్ఞాపకం కాబోతోందని అన్నారు. 

✳️ మంగళకరమైన అక్షయ తృతీయ రోజున (30 ఏప్రిల్) జరగనున్న ఈ అభిషేక వేడుక సందర్భంగా కంచి కామకోటి పీఠానికి తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి  ప్రణామాలు తెలియజేశారు. ఈ గురుపరంపర ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని మానవాళికి ఎల్లప్పుడూ అందించాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు

కంచి 71వ పీఠాధిపతి నూతన నామధేయం " శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి "శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ


ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం కంచి 70వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారి ఆశీస్సులతో 71వ పీఠాధిపతిగా శిష్య స్వీకరణ జరిగినది  అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా రోహిణి నక్షత్ర యుక్త బుధవారం  ఈనాడు కంచి 71వ పీఠాధిపతికి విజయేంద్ర సరస్వతి స్వాములవారు ప్రత్యేక నామకరణం చేయడం జరిగింది శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గా నామకరణం చేయడం జరిగింది  ( వీరికి పూర్వాశ్రమంలో గణేష్ శర్మ అనే నామధేయం    ఈనాటి నుంచి పీఠంలో సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గళ్  జయ జయ శంకర హర హర శంకర.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు