ద్వారకా తిరుమలలో ఘనంగా టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మద్దిపాటి
1982 లో నందమూరి తారక రామారావుగారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి కీర్తిని దశదిశల వ్యాపింప చేశారని,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్. రూ. 2 కిలో బియ్యం పథకంతో లక్షల మంది పేదల కడుపు నింపి తెలుగు వారి హృదయాల్లో ఎన్టీ రామారావు నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు, పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే ధృఢ సంకల్పంతో టీడీపీని స్థాపించారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో పార్టీ పటిష్టం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు. తనకు ఎలాంటి గ్రూపులు, వర్గాలు లేవన్నారు. గ్రామాల్లో ఆధిపత్యపోరును విడనాడాలన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించనన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. అందరూ ఒకే తాటిపై ఉంటూ ఐకమత్యంతో పార్టీ బలమైన నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా పనిచేద్దామన్నారు.
నీతి, నిజాయితీ క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారా లోకేష్ తాత ఎన్టీఆర్, తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు లక్షణాలను పుణికి పుచ్చుకొని అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2029లో కూడా పార్టీ గెలుపే లక్ష్యంగా అందరం కృషి చేయాలన్నారు. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేస్తారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఇదే జైత్రయాత్రను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగిద్దామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం లో లేని విధంగా 130 కోట్ల రూపాయలతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధి కూడా వెంటనే మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ నిధులు చెక్కులు పంపిణీ గోపాలపురం నియోజకవర్గంలో జరిగిందని అన్నారు. అధికారాన్ని ఆధిపత్యం కోసం కాకుండా అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, టీడీపీ కుటుంబ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు