Ticker

6/recent/ticker-posts

వాడవాడలా వంగవీటి రంగా జన్మదిన వేడుకలు


బడుగు బలహీన వర్గాల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు స్థానికులతో కలిసి ద్వారకాతిరుమల అంబేద్కర్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్రంగా విగ్రహానికి, పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. 
అలాగే ద్వారకా తిరుమల వసంత నగర్ కాలనీ లోను రంగా విగ్రహానికి పూల మాలలు వేశారు జోహార్ వంగవీటి మోహన్రంగా అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్రంగా విగ్రహం వద్ద కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న పాఠశాలలో పిల్లలకు చాక్లెట్లు కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణం త్యాగం చేసిన నాయకుడు వంగవీటి మోహన్రంగా అన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత అమలు చేస్తూ ముందుకు సాగాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తరగళ్ళ శ్రీనివాసరావు, అంబటి రాజేష్, కోపల్లి తులసి, సుధాకర్ రావు, నాగు, నక్క రాంబాబు, గున్నంపల్లి, పి కన్నాపురం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు చరణ్, పండు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు