కోహ్లీ గానీ, సచిన్ గానీ కాదు… నా ఫేవరెట్ టీమ్ ఇండియా ప్లేయర్ వేరే వ్యక్తి - క్రిస్ గేల్...
వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, యూనివర్సల్ బాస్‌గా పేరుపొందిన క్రిస్ గేల్ తన ఫేవరెట్ భారత ఆటగాడు ఎవరో వెల్లడించాడు. ఆశ్చర్యకరంగా,భారత క్రికెట్ మహానుభావులు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ పేర్లు ప్రస్తావించకుండా, కేవలం 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆటగాడినే తన ఇష్టమైన ప్లేయర్‌గా ఎంపిక చేశాడు. ఐపీఎల్‌లో ఎన్నో సంవత్సరాలు రాణించిన గేల్, కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. లీగ్ చరిత్రలో అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తనకు ఎంతో ఇష్టమైన ఆటగాడని వెల్లడించాడు. ఇంగ్లండ్ టూర్‌కు సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ, అతని ప్రతిభను మెచ్చుకున్నాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మార్పు తెచ్చుకున్న సర్ఫరాజ్‌ను గేల్ ప్రశంసించాడు. ఫిట్‌నెస్ కంటే ప్రతిభనే ప్రధానంగా పరిగణించి సర్ఫరాజ్‌కు జట్టులో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు.
సర్ఫరాజ్ ఖాన్ కనీసం టెస్ట్ జట్టులో అయినా చోటు దక్కించుకోవాలి. స్వదేశంలో ఇంగ్లండ్‌పై ఆడిన టెస్ట్‌లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఇప్పుడు జట్టులో లేడు. రెండు రోజుల క్రితం అతనిపై వచ్చిన ఒక పోస్ట్ చూశాను. చాలా బరువు తగ్గాడని అందులో ఉంది. నిజానికి అతని బరువుతో ఎలాంటి సమస్య లేదు. బరువుగానే ఉన్నప్పటికీ అప్పుడే రన్స్ సాధించాడు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించిన సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ, “సెలెక్టర్లు అతని ఫిట్‌నెస్‌ని కారణంగా చూపితే అంతకంటే బాధాకరమైన విషయం ఉండదు. అతను 100 శాతం భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు. భారత్‌లో ప్రతిభావంతులు చాలామంది ఉన్నా, సర్ఫరాజ్‌కి మాత్రం తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి” అని గేల్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అన్నారు. నచ్చిన భారత ఆటగాడు ఎవరని అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నకు ఆయన సర్ఫరాజ్ ఖాన్ పేరునే చెప్పారు.
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ కఠినమైన డైట్, జిమ్ వర్కౌట్స్‌తో సుమారు 13 కిలోల బరువు తగ్గి మరింత సన్నగా మారాడు. భారత జట్టులో తిరిగి ప్రవేశం కోసం సిద్ధమవుతున్న సమయంలో గాయంతో దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. అలాగే, ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్‌కు కూడా అతని ఎంపిక జరగలేదు.

0 కామెంట్‌లు