సీఎం సహాయ నిధితో భరోసా: ఎమ్మెల్యే మద్దిపాటి
ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 12:
ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ద్వారకాతిరుమల మండలం పోతేపల్లికి చెందిన నిట్టా సుబ్బారావు అనారోగ్యంతో చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి ద్వారా రూ.4 లక్షల ఎల్బీసీ మంజూరు చేయించారు.
శుక్రవారం నాడు సుబ్బారావు భార్యకు ఆ ఎల్బీసీ పత్రాన్ని ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు మా సమస్యలే. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తాం. ఇప్పటివరకు అనేక కుటుంబాలకు ఈ నిధి ద్వారా సహాయం అందింది. భవిష్యత్తులో కూడా అవసరమున్న ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూస్తాం” అన్నారు.
గ్రామస్థులు సీఎం సహాయ నిధి ద్వారా అందుతున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ప్రజల పట్ల ఎమ్మెల్యే మద్దిపాటి చూపుతున్న శ్రద్ధ, అంకితభావాన్ని ప్రశంసించారు.

0 కామెంట్‌లు