Ticker

6/recent/ticker-posts

మన డబ్బులు – మన లెక్కలు

 గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం – DRDA–SERP ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

DRDA–SERP, మన డబ్బులు – మన లెక్కలు


ఏలూరు జిల్లా:

గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న DRDA–SERP కార్యక్రమాలపై గోపాలపురం మండలంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం గోపాలపురం మండల సమాఖ్య ఆధ్వర్యంలో, గోపాలపురం మహిళా అధ్యక్షులు కాకర్ల తులసి పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.

“మన డబ్బులు – మన లెక్కలు” అనే అంశంపై దొండపూడి క్లస్టర్ పరిధిలోని SHG సభ్యులు, ఎన్‌ఆర్‌ఐ (Enari), VOASలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. మహిళలు తమ పొదుపు, రుణాలు, లెక్కల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని వక్తలు వివరించారు.

ఈ కార్యక్రమాన్ని హుకుంపేట గ్రామంలో పర్సనల్‌గా నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 1200 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక క్రమశిక్షణ, సంఘాల నిర్వహణపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందని, అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణ చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు సంఘటితంగా ఎదగడం ద్వారా కుటుంబాలతో పాటు గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.



ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, SERP సిబ్బంది, SHG సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు