Ticker

6/recent/ticker-posts

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

 మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

ద్వారకాతిరుమల మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం   మండల సర్వసభ్య సమావేశం  ఎంపీడీవో  PVV ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగినది. ముఖ్య అతిథులుగా గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు 

గౌ.శ్రీ. మద్దిపాటి వెంకట రాజు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ ఘంటా పద్మ శ్రీ హాజరయ్యారు.  ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు.


ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు,

 ప్రజా ప్రతినిధులు పంచాయతీలలో సమస్యలను  అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  అధికారులు అవృవద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా  వ్యవహరిస్తామన్నారు. అగ్రికల్చర్ రైతులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని వారికి ముందస్తు వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని  దీనివల్ల రైతులు నష్టపోకుండా చేయవచ్చని అన్నారు. అగ్రికల్చర్ యంత్ర పరికరాలు  అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలని సూచించారు. పొలాల్లోకి మట్టి అవసరమైన రైతులు వీఆర్వో ద్వారా పర్మిషన్ తీసుకుని చెరువుల్లో మట్టి  వినియోగించుకోవచ్చని తెలిపారు. 




రైతుల ద్వారా 4706 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వారికి ఇప్పటి వరకు 10.88 కోట్లు వారు ఎకౌంట్లకు జమ చేసావని అగ్రికల్చర్ అధికారి తెలిపారు. త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ,అగ్రికల్చర్ విద్యాశాఖ, హార్టికల్చర్ మొదలు శాఖలు పనితీరును పరీక్షించి సూచనలు చేశారు . జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మండల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఈవోపిఆర్‌డి సుబ్బరాయన్, ఎమ్మార్వో జెవి.సుబ్బారావు , ఎంపీపీ బొండాడ మోహిని వెంకన్న బాబు, జడ్పీటీసీ  శామ్యూల్, ఎస్సీ  టి. సుధీర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు